ANNOUNCEMENT
G2 Risk Solutions Finalizes EverC Transaction

అంచె 1: దిగువ జాబితా చేయబడిన దేశాలలో ఏ రకం ఆర్థిక సేవల ప్రకటనలనైనా చూపించడానికి, ప్రకటనదారులు తప్పనిసరిగా–మొదటి అంచెగా–G2RS ద్వారా ధృవీకరించబడాలి. G2RS ఆర్ధిక సేవల ధృవీకరణను పొందేందుకు, ప్రకటనదారులు తప్పనిసరిగా వారు: (1) సంబంధిత నియంత్రణ సంస్థ ద్వారా అధికారం పొంది ఉన్నారని; లేదా (2) మినహాయింపు కోసం అర్హత కలిగి ఉన్నారని ప్రదర్శించాలి. దయచేసి గమనించండి: G2RS ధృవీకరణను పొందేందుకు నిర్దిష్ట రకాల ప్రకటనదారులు అవసరం లేదు. G2RS ఆర్ధిక సేవల దృవీకరణ కోసం దరఖాస్తు చేయడానికి ముందు, దయచేసి గూగుల్ యొక్క ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల ప్రకటన విధానాలు చూడండి.

అంచె 2: G2RS ఆర్ధిక సేవల దృవీకరణని పొందిన ఆర్ధిక సేవల ప్రకటనదారులు తప్పనిసరిగా గూగుల్ ప్రకటనదారులు ధృవీకరణ ప్రోగ్రామ్ ద్వారా వారి గుర్తింపుని ధృవీకరించాలి. దయచేసి గూగుల్ నుండి ప్రకటనదారు ధృవీకరణ ఇమెయిల్ కోసం మీ ఇమెయిల్ ఇన్‌బాక్స్‌ని తనిఖీ చేయండి. గమనిక: ప్రకటనదారులు గూగుల్ యొక్క ప్రకటనకర్త గుర్తింపు ధృవీకరణ ప్రోగ్రామ్‌ను మునుపు పూర్తి చేసి ఉంటే, వారు 2వ అంచెను పూర్తి చేయవలసిన అవసరం లేదు.

అంచె 3: 1 మరియు 2 అంచెలను పూర్తి చేసిన తర్వాత, ఎంచుకున్న దేశంలో ఆర్థిక సేవల ప్రకటనలను చూపించడానికి ప్రకటనదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ప్రకటనలను చూపించడానికి దరఖాస్తు చేసినప్పుడు, మీ G2RS కోడ్ కోసం మిమ్మల్ని అడుగుతారు. అదనంగా, అన్ని ఆర్థిక సేవల ప్రకటనదారులు తప్పనిసరిగా గూగుల్ యొక్క ఆర్థిక ఉత్పత్తులు మరియు సేవల ప్రకటన విధానాలు కు కట్టుబడి ఉండాలి. గూగుల్ ప్రకటనల అప్లికేషన్‌ను ఇక్కడ చూడవచ్చు:

 

దృవీకరణ ప్రక్రియ

ఒక నిర్దిష్ట దేశంలో ఆర్థిక సేవలను అందించడానికి వర్తించే నియంత్రణ సంస్థ ద్వారా మీ వ్యాపారానికి అధికారం ఉంటే, దిగువన ఉన్న “వర్తించు” బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా ధృవీకరణ కోసం దరఖాస్తు చేసుకోండి.

అతి ముఖ్యమైనది: ఈ ధృవీకరణ ప్రక్రియ సమయంలో మీరు అందించే వ్యాపార సమాచారం తప్పకుండా సంబంధిత రిజిస్ట్రీలో అందుబాటులో ఉన్న వ్యాపార వివరాలతో ఖచ్చితంగా సరిపోలాలి. ఉదాహరణకు, మీ సంస్థ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ భిన్నంగా ఉంటే లేదా సంబంధిత రిజిస్ట్రీలో అందుబాటులో లేకుంటే మీ ధృవీకరణ విఫలం కావచ్చు.

మీరు మీ దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లయితే, మీరు G2RS నుండి దరఖాస్తు రసీదును అంగీకరిస్తూ నిర్ధారణ ఇమెయిల్‌ను అందుకుంటారు. నిర్ధారణ ఇమెయిల్‌లో మీ దరఖాస్తుకు సంబంధించిన నిర్దిష్ట కోడ్ ఉంటుంది (మీ “G2RS కోడ్”).

 

మినహాయింపు ప్రక్రియ

ఒకవేళ ఆర్థిక సేవల నియంత్రణ ఏజెన్సీ ద్వారా మీ వ్యాపారం అధీకృతం అయి ఉండకపోయినప్పటికీ కూడా మీరు ఆర్థిక సేవలను కోరుతున్నట్లు కనిపించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవచ్చు.

మీరు ఈ మినహాయింపులలో ఒకదాని కోసం దరఖాస్తు చేయాలా అని నిర్ణయించడానికి, దయచేసి దిగువ నిర్వచనాలను సమీక్షించండి.

  • ఆర్థికేతర సేవల ప్రకటనదారులకు మినహాయింపు: ఆర్థిక సేవలను ప్రకటించని కాని ఆర్థిక సేవలను కోరుతున్నట్లు కనిపించే వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక బలమైన కారణాన్ని కలిగి ఉన్న ప్రకటనదారులు. ఉదాహరణలు (సమగ్రం కానివి): శోధన ఇంజిన్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, న్యాయ సంస్థలు.
  • ఆర్థిక సేవల ప్రకటనదారులకు మినహాయింపు:  వర్తించే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ అవసరాల నుండి మినహాయించబడిన ఆర్థిక సేవల ప్రకటనదారులు.

మీరు మీ దరఖాస్తును విజయవంతంగా సమర్పించినట్లయితే, మీరు G2RS నుండి దరఖాస్తు రసీదును అంగీకరిస్తూ నిర్ధారణ ఇమెయిల్‌ను అందుకుంటారు. నిర్ధారణ ఇమెయిల్‌లో మీ దరఖాస్తుకు సంబంధించిన నిర్దిష్ట కోడ్ ఉంటుంది (మీ “G2RS కోడ్”).

5 క్యాలెండర్ రోజులలోపు, G2RS మీ దరఖాస్తు స్థితికి సంబంధించి మీకు ఇమెయిల్ పంపుతుంది (ఉదా., ఆమోదించబడింది, తిరస్కరించబడింది). ఆమోదించబడితే, మీరు ఎంచుకున్న దేశంలో ఆర్థిక సేవలను కోరుతున్నట్లు కనిపించే వినియోగదారులకు ప్రకటనలను చూపడానికి మీరు దరఖాస్తు చేసినప్పుడు మీరు మీ G2RS కోడ్‌ను గూగుల్‌తో షేర్ చేయాల్సి ఉంటుంది. .

 

దరఖాస్తు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?

దయచేసి మీరు ప్రకటన చేయాలనుకుంటున్న దేశాన్ని ఎంచుకోండి.

అదనపు సమాచారం కోసం, దయచేసి దిగువన ఉన్న మా ఎఫ్‌ఎక్యులు చూడండి లేదా financialservicesverification@g2risksolutions.com సంప్రదించండి

తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఎక్యులు)

G2RS ఆర్థిక సేవల ధృవీకరణ కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

G2RS ఆర్థిక సేవల ధృవీకరణను పొందేందుకు, దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారికి: (1) వారు ప్రకటన చేయాలనుకుంటున్న దేశంలో వర్తించే నియంత్రణ సంస్థ ద్వారా వారికి అధికారం ఉన్నట్లు; లేదా (2) వారు మినహాయింపుకు అర్హులు అయినట్లు ప్రదర్శించాలి. మినహాయింపు ప్రక్రియ రెండు విభిన్న రకాల ప్రకటనదారులకు అందుబాటులో ఉంటుంది: (1) మినహాయింపు కలిగిన ఆర్ధికేతర సేవల ప్రకటనదార్లు (ఉదా., శోధన ఇంజిన్‌లు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, న్యాయ సంస్థలు); మరియు (2) మినహాయింపు పొందిన ఆర్థిక సేవల ప్రకటనదారులు. ఈ రెండవ వర్గంలో వర్తించే చట్టం ప్రకారం లైసెన్సు/నమోదు అవసరాల నుండి మినహాయింపు పొందిన ఆర్థిక సేవల ప్రదాతలు ఉన్నారు.

ధృవీకరణ ఖర్చు ఎంత అవుతుంది?

G2RS ఆర్ధిక సేవల ధృవీకరణ వల్ల ప్రకటనదారునికి ఎలాంటి ఖర్చు ఉండదు.

నేను దరఖాస్తు చేయడానికి ఏ సమాచారం అవసరం?

మీకు మీ గూగుల్ ప్రకటనల ఖాతాకు సంబంధించిన సమాచారం అవసరం (ఉదా., గూగుల్ ప్రకటనల ఖాతా కస్టమర్ ఐడి మరియు ధృవీకరణ కోసం దరఖాస్తు చేస్తున్న అధీకృత ప్రతినిధి). మీకు మీ వ్యాపారం గురించిన సమాచారం కూడా అవసరం. దయచేసి గమనించండి: మీ వ్యాపార సమాచారం తప్పనిసరిగా సంబంధిత నియంత్రణ డేటాబేస్‌లో కనుగొనబడిన దానితో ఖచ్చితంగా సరిపోలాలి.

నా G2RS ఆర్థిక సేవల ధృవీకరణ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలను ప్రకటించడానికి నన్ను అనుమతిస్తుందా?

లేదు. G2RS ఆర్థిక సేవల ధృవీకరణ దేశం-నిర్దిష్టమైనది. ప్రస్తుతం, ఆస్ట్రేలియా, సింగపూర్ మరియు తైవాన్‌లలో G2RS ధృవీకరణ అవసరం. మీరు మూడు దేశాలలో ప్రకటన చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా మూడు దరఖాస్తులను సమర్పించాలి.

దరఖాస్తు సమర్పణ నుండి నిర్ణయం వరకు ఆశించిన ధృవీకరణ సమయం ఎంత?

టర్నరౌండ్ సమయం 5 క్యాలెండర్ రోజులు లేదా అంతకంటే తక్కువ.

నేను ఏ డొమైన్‌లను సబ్మిట్ చేయాలి?

వినియోగదారులను ఉద్దేశించిన ప్రకటనలు కల లాండింగ్ పేజీలను లేదా డొమైన్‌లు అన్నింటినీ మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి ధృవీకరించబడ్డాక, అడ్వర్టయిజింగ్‌ చేయడానికి ఉపయోగించేందుకు ఈ డొమైన్‌లలో మీరు అనుమతించబడతారు. సబ్మిట్ చేయబడిన అన్ని డొమైన్‌లు (1) క్రియాశీలకంగా ఉండాలి; (2) పబ్లిక్‌గా అందుబాటులో ఉండాలి; మరియు (3) మీ అప్లికేషన్ నందు సూచించబడిన లైసెన్సెడ్ లేదా మినహాయింపు అంశానికి స్పష్టంగా అనుసంధానించబడి ఉండాలి (అంటే వ్యాపార పేర్లు సరిపోలాలి). మీరు మూడవ-పక్ష వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లను ప్రకటనల కోసం వాడదలుచుకుంటే, మీరు సబ్మిట్ చేసిన డొమైన్ జాబితాలో సంబంధిత డొమైన్‌లను తప్పక చేర్చాలి. ఉదాహరణలు: యూట్యూబ్ ఛానెళ్లు, గూగుల్ ప్లే అప్లికేషన్‌లు, యాపిల్ యొక్క యాప్ స్టోర్ లింక్స్, ఫేస్బుక్ ప్రొఫైల్స్, మొదలైనవి. ముఖ్య గమనిక: మేము ”Google.com” లేదా “Apple.com” వంటి డొమైన్‌లను అంగీకరించలేము మరియు బదులుగా మీ వ్యాపార సమాచారానికి నేరుగా తీసుకెళ్ళే ల్యాండింగ్‌ పేజీలు (పూర్తి యూఆర్‌ఎల్‌ లు) అవసరం అవుతుంది.

నా దరఖాస్తు తిరస్కరించబడితే నేను మళ్లీ దరఖాస్తు చేయవచ్చా?

అవును. మీ దరఖాస్తు తిరస్కరించబడితే, మీరు వివరణను అందుకుంటారు మరియు (వర్తిస్తే) సూచించిన పరిష్కార అంచెలను అందుకుంటారు.

నా అప్లికేషన్ ఇప్పటికే G2RS ద్వారా ఆమోదించబడింది, అయితే నా ప్రకటనలు వినియోగదారులను మళ్లించే డొమైన్ పేర్ల జాబితాను నేను అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను. నేనేం చేయాలి?

దయచేసి మళ్లీ దరఖాస్తు చేసి, ఇలా పేర్కొనే ఎంపికను ఎంచుకోండి: “నా దరఖాస్తు గతంలో మూల్యాంకనం చేయబడింది. నేను మళ్లీ దరఖాస్తు చేసి నా అప్లికేషన్‌లోని డేటా ఫీల్డ్‌లను కొత్త సమాచారంతో అప్‌డేట్ చేయాలనుకుంటున్నాను.” మీరు మళ్లీ దరఖాస్తు చేసినప్పుడు, మీ అసలు దరఖాస్తుతో అనుసంధానించబడిన G2RS కోడ్‌ను మీరు తప్పనిసరిగా సమర్పించాలి. ముఖ్యమైనది: ఈ తదుపరి అప్లికేషన్‌లో మీరు అందించే డొమైన్‌లు మీరు గతంలో సమర్పించిన అన్ని డొమైన్‌లను భర్తీ చేస్తాయి.

నేను G2RS ధృవీకరించబడినప్పటికీ, నా ప్రకటనలను గూగుల్ ఆమోదించకపోతే నేను ఏమి చేయాలి?

G2RS ధృవీకరణ గూగుల్‌తో ప్రకటనలు చేయగల మీ సామర్థ్యానికి హామీ ఇవ్వదు. దయచేసి అన్ని ప్రకటనల విచారణలకు సంబంధించి గూగుల్‌ని సంప్రదించండి.

ధృవీకరణ కోసం నేను ప్రతి సంవత్సరం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా?

లేదు. మీరు G2RS ఆర్థిక సేవల ధృవీకరణ కోసం ఒక్కసారి మాత్రమే (ఒక్కో దేశానికి) దరఖాస్తు చేయాలి. దయచేసి గమనించండి: G2RS ధృవీకరణ లేదా మినహాయింపు ప్రమాణాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి అన్ని ధృవీకరించబడిన సంస్థలను క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తుంది.

G2RS నా ధృవీకరణను ఉపసంహరించుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా?

అవును. ధృవీకరణ ప్రక్రియలో ఒక ప్రకటనదారు అబద్దపు సమాచారాన్ని అందించినట్లు G2RS నిర్ధారిస్తే, G2RS ధృవీకరణను ఉపసంహరించుకుంటుంది. మేము కొన్ని ఇతర పరిస్థితులలో ధృవీకరణను కూడా ఉపసంహరించుకోవచ్చు. ఉదాహరణకు, మేము ప్రతికూల నియంత్రణ చర్యకు ప్రతిస్పందనగా లేదా చట్టం ప్రకారం అవసరమైన విధంగా వ్యాపారానికి తగిన లైసెన్స్/నమోదు చేయబడదని మేము ధృవీకరిస్తే ధృవీకరణను ఉపసంహరించుకోవచ్చు.